Vizag Zoo : వైజాగ్ జూలో 18 ఏళ్ల సింహం మృతి.. కార‌ణం ఇదే..?

విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్క్‌లో 18 ఏళ్ల సింహం మృతి చెందింది. వృద్ధాప్యం కారణంగా గుండెపోటుతో

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 11:40 PM IST

విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్క్‌లో 18 ఏళ్ల సింహం మృతి చెందింది. వృద్ధాప్యం కారణంగా గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.జూలో ఉన్న‌ మహేశ్వరి అనే సింహం శనివారం అర్థరాత్రి మృతి చెందింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సమర్పించిన పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం వృద్ధాప్యంలో తీవ్రమైన మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (గుండెపోటు) కారణమని వైజాగ్ జూ క్యూరేటర్ నందానీ సలారియా తెలిపారు. 2006లో జన్మించిన ఈ సింహం.. 2019లో గుజరాత్‌లోని సక్కర్‌బాగ్ జూ నుండి వైజాగ్ జూకి తీసుకువచ్చారు. ఈ సింహం లక్షలాది మందికి ఆసియాటిక్ సింహాలపై విద్యను అందించి పరిరక్షణకు దోహదపడింది. జూ క్యూరేట‌ర్ సలారియా తెలిపిన వివ‌రాల ప్రకారం.. సింహాలు అడవిలో సుమారు 16 నుండి 18 సంవత్సరాల వరకు జీవిస్తాయని.. అయితే ఈ మహేశ్వరి సింహం 19వ సంవ‌త్స‌రంలోకి ప్ర‌వేశించింద‌ని తెలిపారు. వృద్ధాప్యం కార‌ణంగా సింహం మ‌ర‌ణిచింద‌ని ఆయ‌న తెలిపారు