సహారా ఎడారి పరిధిలోని ఆఫ్రికా దేశాల నుంచి సరిహద్దులోని ఐరోపా దేశం స్పెయిన్ కు అక్రమ వలసలు ఆగడం లేదు. ఉపాధి అవకాశాల కోసం ఎంతోమంది ఆఫ్రికా యువత.. సరిహద్దుల్లోని ఐరోపా దేశాల్లోకి అక్రమంగా చొరబడే యత్నాలు చేస్తుంటారు. ఆఫ్రికా దేశం మొరాకో , ఐరోపా దేశం స్పెయిన్ లకు ఉమ్మడి సరిహద్దులు ఉంటాయి. స్పెయిన్ లోని సరిహద్దు నగరం మేలీలాలోకి శుక్రవారం రాత్రి 2000 మంది ఆఫ్రికన్లు మొరాకో సరిహద్దు నుంచి చొరబాటుకు యత్నించారు. ఎత్తైన కంచెను ఎక్కి మేలీలా నగరంలోకి చొరబడేందుకు ట్రై చేశారు. ఈక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ఆఫ్రికన్లు మృతిచెందగా, 76 మందికి గాయాలయ్యాయి. సరిహద్దు కంచె ఎక్కేందుకు యత్నిస్తున్న వారిని మొరాకో భద్రతా దళాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈక్రమంలో వలసదారుల దాడిలో 140 మంది మొరాకో భద్రతా దళాల సిబ్బంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 130 మంది కంచెను దాటి మేలీలా నగరంలోకి అక్రమంగా ప్రవేశించారని స్పెయిన్ భద్రతా దళాలు వెల్లడించాయి.
Stampede : 2000 మంది చొరబాటు యత్నం.. తొక్కిసలాటలో 18 మంది మృతి

Accidentj