Bus Falls Into Pond : 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి చెరువులో పడి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది బస్సులోనే ఊపిరాడక చనిపోగా.. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 35 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని ఝలకతి సదర్ ఉప జిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో జరిగింది. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నారు. బస్సులో ప్యాసింజర్ల కెపాసిటీ 52 అయితే 60 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనివల్లే బస్సుపై డ్రైవర్ అదుపు కోల్పోయి ఉండొచ్చని అంటున్నారు.బాధితుల్లో ఎక్కువ మంది ఝల్‌కతీలోని రాజాపూర్ ప్రాంతంవాసులని పోలీసులు తెలిపారు.
Also read : Pension : దివ్యాంగుల పెన్షన్ రూ. వెయ్యి పెంచిన తెలంగాణ సర్కార్
ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడంటే ?
“ఆ టైంలో బస్సు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. డ్రైవర్, బస్సు సూపర్‌వైజర్‌తో మాట్లాడటం నేను చూశాను. అకస్మాత్తుగా డ్రైవర్ బస్సుపై కంట్రోల్ కోల్పోయాడు. అది రోడ్డ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లి పడిపోయింది ” అని ఈ బస్సు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఎండీ మోమిన్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. “ఎక్కువ మంది ప్రయాణికులతో ఉండటం వల్ల చెరువులో పడగానే బస్సు తక్షణమే(Bus Falls Into Pond) మునిగిపోయింది. నేను ఎలాగోలా బస్సు నుంచి బయటకు రాగలిగాను” అని మోమిన్ తెలిపాడు.
Also read : Cyber Security : సైబర్ దాడుల నుండి కాపాడటానికి ‘హ్యాక్ స్టాప్’ యాప్ వచ్చేస్తుంది.. త్వరలో విడుదల..
జూన్‌లో 559 రోడ్డు ప్రమాదాలు
బంగ్లాదేశ్‌లో బస్సు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ (RSF) ప్రకారం.. జూన్‌లో మొత్తం 559 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 562 మంది చనిపోగా, 812 మంది గాయపడ్డారు. జూన్ లో దేశవ్యాప్తంగా 207 మోటార్‌సైకిల్ ప్రమాదాల్లో 169 మంది మరణించారని, ఇది మొత్తం మరణాలలో 33.75 శాతంగా ఉందని బుధవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది.