Site icon HashtagU Telugu

Telangana : తెలంగాణ ఆర్థిక శాఖ‌లో 1,663 ప్ర‌భుత్వ ఉద్యోగ ఖాళీలు

Harishrao

Harishrao

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖలో 1,663 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను శనివారం ప్రకటించింది. తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శనివారం తన ట్విట్టర్‌లో ఖాళీలను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించేవారికి శుభవార్త – 1663 ఖాళీలకు ఉత్తర్వులు జారీ చేయ‌బ‌డ్డాయ‌ని… కేవలం 3 నెలల్లోనే 46,888 ఉద్యోగాల నోటిఫికేషన్‌లు వచ్చాయి అంటూ ఆయ‌న ట్విట్ట‌ర్ లో తెలిపారు . తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విడుదల చేసిన కొత్త ఉద్యోగాల వివరాలను మంత్రి హ‌రీష్‌ రావు వెల్ల‌డించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు పట్టణానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులపై మంత్రి హ‌రీష్ రావు ఫైర్ అయ్యారు. వలస పక్షులు ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడంలో బిజీగా ఉండగా.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నదని హరీష్ రావు వ్యాఖ్యానించారు.