Site icon HashtagU Telugu

Praggnanandhaa: పిట్ట కొంచెం.. ఆట ఘనం!

Chess

Chess

16 ఏళ్ల చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద సోమవారం ఎయిర్‌ థింగ్స్ మాస్టర్స్ రాపిడ్ ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్ ఎనిమిదో రౌండ్‌లో నార్వేకు చెందిన ప్రపంచ నం. 1 మాగ్నస్ కార్ల్ సన్‌కి షాక్ ఇచ్చాడు. గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సాధించిన ఐదో పిన్న వయస్కుడైన ప్రజ్ఞానంద, 31 ఏళ్ల కార్ల్ సెన్‌తో చాకచాక్యంగా ఆడి, టార్రాష్ వేరియేషన్ గేమ్‌లో తనదైన ఎత్తుగడలు వేసి విజయం సాధించాడు. అంతేకాదు.. కార్ల్ సన్ వరుస విజయాలకు అడ్డకట్ట వేశాడు.

2013లో వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ U-8 టైటిల్‌ను గెలుచుకున్న ఈ కుర్రాడు. ఏడేళ్లలోనే FIDE మాస్టర్ టైటిల్‌ను సంపాదించాడు. కార్ల్ సన్ తర్వాత, ఈ కుర్రాడికి రెండు విజయాలు, రెండు డ్రాలు, నాలుగు ఓటములు ఖాతాలో ఉన్నాయి. ఈ విజయంతో 8 పాయింట్లు సాధించిన ప్రజ్ఞానంద 12వ ర్యాంకుకు చేరుకున్నాడు.