NIZAMABAD: పుడ్ ఫాయిజన్ తో 16 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

  • Written By:
  • Updated On - December 8, 2023 / 12:50 PM IST

NIZAMABAD:  నిజామాబాద్ జిల్లాలోని బోర్‌గావ్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన 16 మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడ్డారు. నలుగురిలో వాంతులు చేసుకున్న విద్యార్థినులను తొలుత సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) తరలించి అనంతరం నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి (జీజీహెచ్‌) తరలించారు. చికిత్స తర్వాత, 12 మంది విద్యార్థులు కోలుకున్నారు. నలుగురు విద్యార్థులు మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నలుగురిని ఇవాళ  డిశ్చార్జి చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మొత్తం 175 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తిన్నారు. అయితే సాయంత్రం 4 గంటల సమయంలో విద్యార్థులు ఫిర్యాదు చేయడం ప్రారంభించారని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఎన్ దుర్గాప్రసాద్ నివేదించారు. ప్రస్తుతం 12 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మిగిలిన నలుగురు విరేచనాలు, వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నారని జీజీహెచ్‌ నిజామాబాద్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమ రాజ్‌ తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ జీజీహెచ్‌ని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు కలుషిత ఆహారాన్ని అధికారులు అందజేస్తున్నారని మండిపడ్డారు.