Site icon HashtagU Telugu

Maoists Surrender: 16 మంది మావోయిస్టులు లొంగుబాటు!

Maoists Surrender

Maoists Surrender

Maoists Surrender: చత్తీస్‌ఘ‌డ్‌ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సుకుమా జిల్లా భద్రత బలగాలు విజయం సాధించాయి. ప్రభుత్వ లొంగబాటు విధానం, నాయద్ నెల నార్ పథకంతో ప్రభావితమై ఇద్దరు కఠినమైన పీఎల్‌జీఏ మావోయిస్టులతో సహా మొత్తం 16 మంది మావోయిస్టులు (Maoists Surrender) బస్తర్ ఎస్పీ కిరణ్ చౌహాన్, ఏఎస్పీ ఉమేష్ గుప్తా, సీఆర్‌ఫీఎఫ్‌ సుజిత్ పాల్ వర్మ, ఆర్ఎఫ్‌టీ, కుంట, (డీఐజి ఆఫీస్) 218 సీఆర్‌ఫీఎఫ్‌ అసిస్టెంట్ కామండెంట్ తిలక్ రామ్, ఉన్నతాధికారుల ముందు తమ ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు.

Also Read: Heinrich Klassen: క్రికెట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్‌!

వీరందరిపై రూ. 25 లక్షల రివార్డు ఉండగా.. లొంగిపోయిన వారిలో ఒక మహిళ మావోయిస్టు, ఒక పురుష మావోయిస్టుపై ఒక్కొక్కరికి రూ. 8 లక్షలు, ముగ్గురు పురుషులకు రెండు లక్షల రూపాయ‌ల‌ చొప్పున, మరో పురుష మావోయిస్టుపై మూడు లక్షల రూపాయ‌ల‌ మొత్తం రూ. 25 లక్షల రివార్డు ప్రకటించారు. ఒకపక్క గాలింపు చర్యలు.. ఎన్‌కౌంట‌ర్ల‌కు భయపడి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.