Site icon HashtagU Telugu

Himachal Pradesh Bus Accident: హిమాచల్ కులులో ఘోర ప్రమాదం.. 16 మంది దుర్మరణం

Himachal

Himachal

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్రంలోని కులులో ఈ ఉదయం బస్సు లోయలో పడిపోవడంతో పాఠశాల విద్యార్థులతో సహా 16 మంది ప్రయాణికులు మరణించారు. ప్రమాదాన్ని పరిశీలిస్తే బస్సు భారీగా దెబ్బతిన్నట్టు స్పష్టమవుతోంది. కులు డిప్యూటీ కమీషనర్ అశుతోష్ గార్గ్ మాట్లాడుతూ.. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సైంజ్‌కు వెళుతున్న బస్సు జంగ్లా గ్రామ సమీపంలోని లోయలో పడిపోయింది. జిల్లా అధికారులు, రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.