Site icon HashtagU Telugu

16 Ft Fish: వామ్మో.. సముద్రంలో దొరికిన 16 అడుగుల చేప.. కీడు జరగబోతోందంటూ?

D94b84cd Da34 4843 9934 F178de24d1f7

D94b84cd Da34 4843 9934 F178de24d1f7

సముద్రాలలో, నదులలో చేపలను పట్టడం కోసం వెళ్లే మస్యకారులకు అప్పుడప్పుడు కొన్ని వింత జీవులు భయంకరమైన జీవులు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు సముద్రంలో జీవించే కొన్ని వింత జంతువులు తీరానికి కూడా కొట్టుకొని వస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే తాజాగా చిలీలో సముద్రవేటకు వెళ్లిన మత్స్యకారుల బృందానికి ఏకంగా 16 అడుగుల పొడవున్న అరుదైన చేప చిక్కింది. సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చి క్రేన్‌కి వేలాడుదీసిన వీడియో క్లిప్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలు వైరల్‌గా మారాయి. చాలా పొడవుగా కనిపిస్తున్న ఈ చేపను ఓర్‌ ఫిష్ గా గుర్తించారు. ఇది 5 మీటర్లకుపైగా అనగా 16 అడుగులు పొడవు ఉంటాయి.

అయితే అరుదైన ఈ చేప కనిపించడంతో జనాలు హడలిపోతున్నారు. అయితే కొందరు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆ చేయమను వీక్షిస్తూ ఉండగా మరికొందరు మాత్రం ఆ చేప కనిపించడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని అంటున్నారు. ఓర్ ఫిష్ కనిపించడాన్ని అపశకునంగా నమ్ముతూ సునామీ, భూకంపాలు లాంటివి వస్తాయని ఒక విశ్వాసం ఉంది. ఈ విషయం పై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఇదొక భయపెట్టే అద్భుతమైన చేప అని పేర్కొన్నాడు. మరొక నెటిజన్ సముద్రగర్భం లోతుల్లో జీవించే ఓర్ ఫిష్ భూపొరల్లో కదలికలు వచ్చినప్పుడు మాత్రమే సముద్రజలాల ఉపరితలానికి చేరతాయని వెల్లడించాడు.

అలాగే జలాల్లో పైకి వచ్చాయంటే సముద్ర గర్భంలో భారీ భూకంపాలు సంభవిచ్చినట్టు సంకేతమని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కాగా తొలుత ఈ వీడియోని టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. దాదాపు 10 మిలియన్ల ఓట్లు వచ్చాయి. కాగా ఈ ఓర్ ఫిష్ కనిపిస్తే ఏదో కీడు జరగబోతోందని కొన్ని చోట్ల పూర్వకాలం నుంచి నమ్ముతున్నారు. ముఖ్యంగా సునామీ, భూకంపాలు వస్తాయని విశ్వసించేవారట. ప్రస్తుతం ఈ చేప జలాలపైకి రావడానికి కారణం ఏంటో అధికారులు గుర్తించాలని సూచనలు అందుతున్నాయి. కాగా ఓర్‌ ఫిష్ పొడవు 11 మీటర్ల వరకు ఉంటుంది. ఇవి సముద్రపు నీటి అడుగున జీవిస్తాయి. అయితే ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, బ్రీడింగ్ సమయంతోపాటు చనిపోయాక కూడా జలాలపైకి వస్తాయని నిపుణులు వివరించారు. ఈ చేపలు కనిపించడం చాలా అరుదట. చిలీ కంటే ముందు ఏప్రిల్ నెలలో న్యూజిలాండ్‌లో ఒక ఓర్ ఫిష్ కనిపించింది. స్థానికంగా బీచ్‌కు వెళ్లినవారు దీనిని గుర్తించడం జరిగింది.

Exit mobile version