ప్రపంచ వ్యాప్తంగా యావత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఒకే ఒక సీజన్ ఐపీఎల్. ప్రతి సీజన్‌లో దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్స్‌కు మజాను నింపుతుంది. కల్లు చెదిరే క్యాచ్‌లతో ఫీల్డర్స్ చేసే విన్యాసాలు, క్రికెట్ డిక్షనరీలో లేని కొత్త కొత్త షాట్లతో గూజ్‌బంప్స్ తెప్పించే బ్యాటర్లు, కళ్ళు మూసి తెరిచేలోపు స్టంపింగ్‌లు చేసే కీపర్లు, ఊహించని వేగంతో బంతులు వేసే బౌలర్లు, అప్పుడప్పుడూ షాకింగ్ డెసిషన్లతో షాకిచ్చే అంపైర్లు, కామెంట్రీ బాక్స్‌లో తమ వాక్ చాతుర్యం ప్రదర్శించే కామెంటేటర్లు, సిక్స్‌లు ఫోర్‌లు బాదినా, ఔటైనా ఛీర్ గర్ల్స్ వేసే డ్యాన్సులు, అన్నిటి కంటే ముఖ్యంగా స్టేడియంలో కేరింతలు కొడుతూ రచ్చ రచ్చ చేసే ప్రేక్షకులు.. అందుకు ఐపీల్ అంటే ప్రతిఒక్కరికీ ఎంతో ఆశక్తి.
ఇక తాజాగా 15వ ఐపీఎల్ ప్రీమియర్ లీక్ ఈరోజు నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మార్చి 26న ప్రారంభమయ్యే 15వ ఐపీఎల్ సీజన్, మే 29న ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. ఇక ఈ సీజన్‌లో తొలిమ్యాచ్ ముంబయి వాఖండే స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్, కొల్‌కత్తా నైట్ రైడర్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఫస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 2011 తర్వాత జరిగిన ఐపీఎల్ సీజన్స్ అన్నీ, ఎనిమిది జట్లతోనే మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే ఈసారి కొత్తగా రెండు జట్లు జాయిన్ అయ్యాయి. దీంతో ఈసారి పది జట్లతో మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ క్రమంలో కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ వచ్చి చేరాయి. మరి ఈసారి మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగనున్న నేపధ్యంలో, ఈ సీజన్ విన్నర్ ఏవరవుతారో చూడాలి.