Site icon HashtagU Telugu

Snake Bite: పాము కాటుకు గురై 15 ఏళ్ల బాలుడు మృతి

Snake Bite

Snake Bite

Snake Bite: పాలిలో పాము కాటుతో 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మృతుడు తల్లిదండ్రులతో కలిసి పొలంలో నిద్రిస్తున్నాడు. బాలుడు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు లేచి చూడగా కుమారుడు పాము కాటుకు గురయ్యాడని గమనించి పాలీలోని బంగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఆసుపత్రి మార్చురీ వెలుపల మృతుల బంధువులు, సన్నిహితులు విలపించారు.

గూడా అఖేరాజ్ గ్రామ సమీపంలోని పొలంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు దేసూరి ఎస్‌హెచ్‌ఓ రవీంద్రపాల్ సింగ్ తెలిపారు. హకీం ఖాన్ మొయిలా కుమారుడు 15 ఏళ్ల మహ్మద్ సాహిల్ శనివారం రాత్రి పొలంలో తల్లిదండ్రులతో కలిసి నిద్రించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో సాహిల్ అరుపులు విని నిద్ర లేచి చూసే సరికి పాము కాటుకు గురైనట్లు తెలిసింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అతడిని పాలి బంగర్ ఆసుపత్రికి తీసుళ్లారు. బంగర్ ఆసుపత్రిలో పరీక్షించిన తర్వాత, అతను చనిపోయినట్లు డాక్టర్ ప్రకటించారు.

Also Read: Charlie In Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లోకి చార్లీ