Muharram Procession: మొహర్రం ఊరేగింపులో విషాదం: హైటెన్షన్ వైరు తగిలి 15 మంది పరిస్థితి విషమం

బీహార్‌లోని అరారియా జిల్లా పలాసి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మొహర్రం ఊరేగింపులో ప్రమాదం జరిగింది. పిప్రా బిజ్వార్ ప్రాంతంలో మొహర్రం ఊరేగింపు జరిగింది. ఊరేగింపులో వేలాది మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో హై టెన్షన్ వైరు తగలింది.

Published By: HashtagU Telugu Desk
Muharram Procession

Muharram Procession

Muharram Procession: మొహర్రం ఊరేగింపులో విషాదంచోటుచేసుకుంది. ఊరేగింపులో హైటెన్షన్ వైరు తగిలి 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

బీహార్‌లోని అరారియా జిల్లా పలాసి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మొహర్రం ఊరేగింపులో ప్రమాదం జరిగింది. పిప్రా బిజ్వార్ ప్రాంతంలో మొహర్రం ఊరేగింపు జరిగింది. ఊరేగింపులో వేలాది మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో హై టెన్షన్ వైరు తగలింది. ఈ ఘటనలో 15 మందికి పైగా గాయపడగా, వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పలాసి పోలీస్ స్టేషన్‌లోని పిప్రా బిజ్వాడ్ ప్రాంతంలో ముహర్రం ఊరేగింపు సందర్భంగా విద్యుత్ షాక్ కారణంగా 15 మంది గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు. ముహర్రం ఊరేగింపు పిప్రా బిజ్వాడ్ నుండి దాబ్డీకి తరలిస్తుండగా పొలంలో విద్యుత్ వైరు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత ఊరేగింపులో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న స్థానికుల సహకారంతో క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం పలాసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ఇక్కడ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అరారియాలోని సదర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. చాలా మంది చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

బుధవారం బీహార్‌లోని పలు ప్రాంతాల్లో మొహర్రం సందర్భంగా ఊరేగింపు కార్యక్రమాలు జరిపారు. మొహర్రం దృష్ట్యా పలు నగరాల్లో భద్రతను పెంచారు.

Also Read: Dengue : కర్ణాటకను వణికిస్తున్న డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు

  Last Updated: 17 Jul 2024, 06:23 PM IST