Site icon HashtagU Telugu

Minor Boys: బైక్ రైడింగ్ చేస్తున్న మైనర్లు.. 144 మందిపై కేసులు

Helmet Rule

Helmet Rule

ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) తెలియని మైనర్లు బండి నడుతుపున్నారా? చిన్న వయసులో మీ పిల్లాడికి బండిని (Bike) గిఫ్ట్ గా ఇస్తున్నారా.. అయితే మీ పిల్లాడు జైలుకు వెళ్లడం ఖాయం. ఇది కేవలం హెచ్చరిక కాదు, ఇప్పటికే ఇలా 144మంది మైనర్లపై (Minor) కేసులు పెట్టి వారిలో 91మందిని జువైనల్ హోమ్ కి తరలించారు వరంగల్ పోలీసులు. రోడ్డుమీద మైనర్లు బండితో కనపడితే వెంటనే పట్టుకుంటున్నారు.

తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలివ్వడం చట్టరీత్యా నేరం. వారు ఎంత బాగా నేర్చుకున్నా.. వారి వయసు, పరిణితి వాహనాలు నడపడానికి సరిపోవు అని మోటార్ వెహికల్ యాక్ట్ చెబుతోంది. పైగా రోడ్డు ప్రమాదాల్లో 20శాతం మైనర్ల వల్లే జరుగుతున్నాయనే గణాంకాలు కూడా పిల్లలకు వాహనాలివ్వడం ఎంత ప్రమాదకరమో చెప్పకనే చెబుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు వరంగల్ (Warangal) పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Also Read: RR vs CSK: ఐపీఎల్‌లో నేడు హై ఓల్టేజీ మ్యాచ్.. చెన్నై విజయాలకు రాజస్థాన్ బ్రేక్ వేయగలదా..?