తమిళనాడులో జల్లికట్టు కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలుడిని ఎద్దు ఢీకొట్టడంతో మరణించాడు. తమిళనాడులోని ధర్మపురిలో జల్లికట్టు క్రీడను తిలకించేందుకు వచ్చిన 14 ఏళ్ల బాలుడు గోకుల్ ని ఎద్దు పొడిచింది. ఘటన జరిగినప్పుడు గోకుల్ తన బంధువులతో కలిసి జల్లికట్టు చూసేందుకు వెళ్లాడు. ఎద్దు పొట్టలోకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గోకుల్‌ను వెంటనే ధర్మపురి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోకుల్ ఎలా గాయపడ్డాడో తెలుసుకోవడానికి సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది జల్లికట్టులో నలుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
Tamil Nadu : తమిళనాడులో జల్లికట్టులో విషాదం.. ఎద్దు పొడవడంతో 14 ఏళ్ల బాలుడు మృతి

Jallikattu Season Has Started.. 70 People Injured In Pudukkottai!!