Site icon HashtagU Telugu

Karnataka : క‌ర్ణాట‌క‌లో 14 మంది చిన్నారుల‌కు అస్వ‌స్థ‌త‌

Kids In Hospitals

Kids In Hospitals

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్‌ పట్టణంలో 14 మంది చిన్నారులు అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. యాంటీబయాటిక్‌ ఇంజక్షన్లు వేయడంతో జలుబు, జ్వరంతో ఆస్పత్రి పాలైన 14 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రిలో చేరిన చిన్నారుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం శివమొగ్గలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. జలుబు, జ్వరం సోకడంతో చిన్నారులు ఆస్పత్రిలో చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ‌ అధికారులు తెలిపారు. అక్కడి నర్సులు ఆదివారం రాత్రి వారికి యాంటీబయాటిక్ ఇంజక్షన్లు ఇచ్చారు. ఇంజెక్షన్లు ఇచ్చిన వెంటనే, పిల్లలకు తీవ్రమైన జ్వరం, వణుకు వచ్చింది. ఈ పరిణామంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. పిల్లలకు మందులు వేసి, వాడిన యాంటీబయాటిక్ ఔషధాన్ని ఆరోగ్య అధికారులు ధృవీకరించారు. స్థానిక బిజెపి ఎమ్మెల్యే హాలప్ప సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిశీలించి పిల్లలకు సరైన వైద్యం అందించాలని ఆరోగ్య అధికారులను ఆదేశించారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే తాను ఆసుపత్రికి చేరుకున్నానని.. పిల్లలను వెంటనే మెరుగైన చికిత్స అందించాల‌ని ఆరోగ్య అధికారులకు ఆదేశాలు ఇచ్చానని తెలిపారు.