Site icon HashtagU Telugu

14 Cows Killed: దారుణం.. ప్రైవేట్ బస్సు ఢీ, 14 ఆవులు మృతి

Cows Imresizer

Cows Imresizer

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మంగళవారం ఓ ప్రైవేట్ బస్సు పశువుల మందను ఢీకొనడంతో 14 ఆవులు మృతి చెందాయి. అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై బుగ్గబావిగూడెం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆరు ఆవులకు కూడా గాయాలయ్యాయి. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న పశువుల మంద రోడ్డు దాటుతుండగా ఢీకొంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి దారితీసిందని, వాహనం అతివేగంతో వెళ్లిందని పశువుల యజమాని ఆరోపించారు. తనను కాపాడుకునేందుకు పక్కకు వెళ్లానని రైతు చెప్పాడు. అయితే బస్సు ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ ఘటనలో రైతుకు రూ.7 లక్షల నష్టం వాటిల్లింది. రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.