Site icon HashtagU Telugu

సైకిల్ పైన 250 కిలోమీటర్లు ప్రయాణించిన 13 ఏళ్ల బాలుడు.. చివరికి అలా.?

Punjab

Punjab

తాజాగా పంజాబ్ కు చెందిన ఒక 13 ఏళ్ల యువకుడు సైకిల్ పై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 250 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. పంజాబ్ లోని పటియాలా ప్రాంతం నుంచి 13 ఏళ్ల యువకుడు మూడు రోజులకు ఢిల్లీ చేరుకున్నాడు. తనకు ఇష్టమైన యూట్యూబ్‌ స్టార్‌ను కలిసేందుకు అతని ఇంతటి సాహసానికి పూనుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని పటియాలా ప్రాంతానికి చెందిన 13ఏళ్ల బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. నిశ్చయ్‌ మల్హన్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ట్రిగ్గర్డ్‌ ఇన్సాన్‌ యూట్యూబ్‌ ఛానల్‌ అంటే 13 ఏళ్ల పిల్లవాడికి ఎంతో ఇష్టమట. అతనికి యూట్యూబ్‌లో కోటిన్నరకు పైగా సబ్‌ స్క్రైబర్లు ఉన్నారు.

బాలుడు కూడా అతన్ని అతను ఫాలో అవుతున్నాడు. అయితే ఆ ఛానల్‌ నిర్వాహ‌కుడు నిష్‌ చాయ్ మ‌ల్హాన్‌ను క‌లవాలని నిర్ణయించుకున్న ఆ కుర్రాడు బాలుడు మ‌ల్హాన్ ఢిల్లీలోని పితంపుర ప్రాంతంలో నివ‌సిస్తున్న‌ట్లు తెలుసుకొని విద్యార్థి తన సైకిల్‌పై అక్టోబ‌ర్ 4న ఢిల్లీకి పయనమయ్యాడు అలా మూడు రోజుల పాటు 250 కిలోమీట‌ర్లు సైకిల్‌ పై ప్ర‌యాణించి పితంపుర అపార్ట్‌మెంట్స్‌కు చేరుకున్నాడు. కానీ తీరా అక్కడికి వెళ్లిన తర్వాత మ‌ల్హాన్ అక్కడ లేడని, దుబాయ్ వెళ్లిన‌ట్లు చెప్పడంతో అత‌ను తీవ్ర నిరాశ చెందాడు.

కొడుకు కనిపించకుండా పోవడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు పటియాలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు..పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటీజీలో బాలుడు ఢిల్లీ వెళ్లినట్లు కనిపించడంతో వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. అలా చివరికి ఆ యువకుడు యూట్యూబర్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద ఉన్న సీసీటీవీ పరిశీలించగా పోలీసులు బాలుడి సైకిల్‌ను గుర్తించారు, అనంతరం అతని ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్‌ వద్ద బాలుడిని కనుగొన్నారు. దీంతో పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. అయితే అతడు రాత్రిళ్లు ఎక్కడ బస చేశాడో ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడో స్పష్టత రాలేదు.