Rape : ప్రకాశం జిల్లాలో 13 ఏళ్ల బాలిక ను హత్యాచారం చేసి..చంపేశారు

దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా..మహిళలకు మాత్రం స్వేచ్ఛగా తిరిగే స్వాతంత్రం

Published By: HashtagU Telugu Desk
Gangraped

13 Year Old Girl Rape And Murder In Prakasam District

దేశ వ్యాప్తంగా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా..మహిళలకు మాత్రం స్వేచ్ఛగా తిరిగే స్వాతంత్రం రాలేదనే చెప్పాలి. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా వారిపై హత్యాచారాలకు పాల్పడుతూ వారి కోర్కెలు తీర్చుకుంటున్నారు. కోర్ట్ లు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ వారిలో మాత్రం భయం , మార్పు రావడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం (Prakasham) జిల్లాలో దారుణం జరిగింది.

13 ఏళ్ల స్కూల్ విద్యార్థిని ఫై కొంతమంది దుండగులు దాడి చేసి ఆమెపై హత్యాచారానికి (Rape) పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె ముఖంపై రాయితో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గొల్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. చెరువుకు సమీపంలో 13 ఏళ్ళ మంజుల (Manjula) అనే విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. విద్యార్థిని బండతో కొట్టి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

గ్రామస్తులు సమాచారం అందించడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనాస్థలంలో దొరికిన స్కూల్ పుస్తకాల ఆదారంగా విద్యార్థినిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.బాలికను అత్యాచారం చేసి చంపినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అలాగే హైదరాబాద్ (Hyderabad) లోను మరో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారు నందనవనంలో ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ (Gang Rape) జరిగింది. కత్తులతో బెదిరించి ఓ గంజాయి బ్యాచ్‌ (Ganja Batch) బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తమ్ముడి ముందే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read Also : Mind Game in AP : బోగ‌స్ స‌ర్వేల హ‌వా

  Last Updated: 22 Aug 2023, 01:57 PM IST