Subway Attack: న్యూయార్క్ లో కాల్పులు. 13 మంది మృతి

అమెరికాలో వాణిజ్య రాజధాని న్యూయార్క్‌ సిటీలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని బ్రూక్లిన్‌ 36వ స్ట్రీట్‌ సబ్‌వే స్టేషన్‌లో ఓ ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు అమెరికన్ మీడియా తెలిపింది.

ఆ కాల్పుల్లో ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన బాధితుల ఫోటోలు, స్టేషన్‌లోని తాజా పరిస్థితి ఎలా ఉందో తెలిపే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ సంఘటన ఉదయం స్టేషన్‌లో రద్దీగా వున్న సమయంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఘటనాస్థలంలో పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు వార్తలు వస్తోన్నా, ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని న్యూయార్క్‌ పోలీసులు తెలిపారు. అయితే బ్రూక్లిన్‌లోని 36వ స్ట్రీట్‌, 4వ అవెన్యూ ప్రాంతంలోకి ప్రజలెవరూ వెళ్లొద్దని పోలీసులు సూచనలు జారీ చేశారు. కాల్పుల నేపథ్యంలో సబ్‌వేలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు.

కాల్పులు జరిపిన దుండగుడు మాస్క్ వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు సబ్ వే నుంచి భారీ పొగలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాల్పులు చేసింది ఎవరనే విషయం పోలీసులు ఇంకా తెలుపలేదు.