Site icon HashtagU Telugu

Pakistan Bus Accident: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం.. 13 మంది దుర్మరణం

Mexico Bus Crash

Road accident

Pakistan Bus Accident: శనివారం సాయంత్రం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం (Pakistan Bus Accident) జరిగింది. ప్రయాణికులతో నిండిన బస్సు ఇస్లామాబాద్-లాహోర్ హైవేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, రెండు డజన్ల మందికి పైగా గాయపడినట్లు సమాచారం. అక్కడి మిడియా కథనం ప్రకారం.. ఈ బస్సు ఇస్లామాబాద్ నుండి లాహోర్ వెళ్తోంది. ఆ సమయంలో కల్లార్ కహర్ సమీపంలో ఇస్లామాబాద్-లాహోర్ హైవేపై నడుస్తున్న ఈ బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. దింతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద స్థలంలో ఎన్‌హెచ్‌ఎంపీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని నేషనల్ హైవే అండ్ మోటర్‌వే పోలీస్ (ఎన్‌హెచ్‌ఎంపీ) ఒక ప్రకటనలో తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.

కల్లార్ కహర్ సమీపంలో మోటర్‌వేపై బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది

ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, పిల్లలు సహా కనీసం 13 మంది మరణించారని, డజన్ల కొద్దీ మంది గాయపడ్డారని పాకిస్థాన్ రెస్క్యూ 1122 సర్వీస్ ప్రతినిధి ఫరూక్ అహ్మద్ తెలిపారు. కల్లార్ కహర్ సమీపంలో మోటర్‌వేపై ఉన్న డివైడర్‌ను బస్సు ఢీకొనడంతో ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని ఆయన అన్నారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు డ్రైవర్ అదుపు తప్పి డివైడర్ లైన్‌ను ఢీకొని బోల్తా పడిందని తెలిపారు.

Also Read: Drunk On Liquor: మ‌ద్యం మ‌త్తులో భ‌లే దొరికేశాడు.. 30ఏళ్ల నాటి హ‌త్య వివ‌రాలు బ‌య‌ట‌పెట్టిన వ్య‌క్తి

పోలీసులు, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు

పాకిస్తాన్ డైలీ నివేదికలో మోటర్‌వేపై పోలీసుల సహాయక చర్య కొనసాగుతోందని, మృతదేహాలను, గాయపడిన వారిని వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్పారు. అంతకుముందు ఫిబ్రవరిలో కూడా కల్లార్ కహర్ సమీపంలో బస్సు ఒక గుంతలో పడి బోల్తా పడడంతో మహిళలు, పిల్లలతో సహా కనీసం 14 మంది ప్రయాణికులు మరణించారు. 64 మంది గాయపడ్డారు. వారు ఒక వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.