అగంతుడు జరిపిన కాల్పుల్లో రష్యాకు చెందిన స్కూల్ పిల్లలు 9 మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు.ఇప్పటికీ గుర్తుతెలియని షూటర్ రాజధాని ఇజెవ్స్క్‌లోని పాఠశాలలోకి ప్రవేశించి ఈ ఘటనకు పాల్పడ్డాడు. అక్కడ ఒక గార్డు , కొంతమంది పిల్లలను చంపినట్లు వీడియో ప్రకటనలో ఉడ్ముర్టియా ప్రాంత గవర్నర్, అలెగ్జాండర్ బ్రెచలోవ్ తెలిపారు. పిట్స్బర్గ్ సమీపంలోఅమ్యూజ్‌మెంట్ పార్క్ వద్ద కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. పాఠశాలలో 1 నుంచి 11వ తరగతి వరకు పిల్లలు ఉన్నారు. గవర్నర్ మరియు స్థానిక పోలీసుల కథనం ప్రకారం, సాయుధుడు తనను తాను కాల్చుకున్నాడు. దీంతో పాఠశాల ఖాళీ చేసి, దాని చుట్టూ ఉన్న ప్రాంతం కంచె వేశారు.
కాల్పులు జరిపిన వ్యక్తి లేదా అతని ఉద్దేశాల గురించి ఎటువంటి వివరాలు విడుదల కాలేదు.
Russia Shooting : రష్యా స్కూల్లో తుపాకీ తూటాలకు 9గురి మృతి

US Shootout