Bank Holidays March 2022: మార్చిలో 13 రోజులు బ్యాంక్​ సెలవులు..!

  • Written By:
  • Publish Date - February 28, 2022 / 11:16 AM IST

దేశంలో ప్రతి రోజు చాలా మంది బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు జరుపుతుంటారు. ఈ క్ర‌మంలో బ్యాంకులకు ప్రతి నెల ఏయే రోజున సెలవు ఉంటుంది.. ఏయే రోజు బ్యాంకులు పనిచేస్తాయనే విషయం ముందస్తుగా తెలుసుకుంటే, మ‌న‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకు సంబంధించిన పనులు పూర్తి చేసుకోవచ్చు.

ఈరోజుతో ఫిబ్రవరి ముగియనుంది. రేప‌టి నుంచి మార్చి నెల స్టార్ట్ అవుతున్న నేప‌ధ్యంలో, వ‌చ్చే నెల‌లో మీకు బ్యాంకులో పని ఉంటే ఈ విషయం మీకోసమే. మార్చి నెల‌లో బ్యాంకుల‌కు మొత్తం 13 రోజులు సెలవులు ఉండ‌నున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్​బీఐ గౌడ్‌లైన్స్ ప్రకారం మార్చి నెలకు సంబంధించి సెలవుల జాబితా విడుదలైంది.

అయితే ఇక్కడ ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే. ప‌లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 13 రోజులు సెలవులు ఉండకపోవచ్చు. ఎందుకంటే సెలవులను స్థానిక పండుగలు, ఇతర ప్రత్యేక దినాలను ఆధారంగా చేసుకుని నిర్ణయిస్తారు. ఈ క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకుల‌కు 8 రోజులు సెలవులు రానున్నాయి. మరి మార్చి నెల‌లో ఎక్కడెక్కడ బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* మార్చి 1 – మహాశివరాత్రి.. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రడూన్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, షిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, హైదరాద్‌లో సెలవులు)
* మార్చి 3 – లోసర్ (గ్యాంగ్‌టాక్)
* మార్చి 4 – చప్‌చార్ కుట్ (ఐజ్వాల్)
* మార్చి 6 – ఆదివారం (అన్ని చోట్ల సెలవు)
* మార్చి 12 – రెండో శనివారం (అన్ని చోట్ల సెలవు)
* మార్చి 13 – ఆదివారం (అన్ని చోట్ల సెలవు)
* మార్చి 17 – హోళికా దహన్ (డెహ్రడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ)
* మార్చి 18 – హోళీ/ ధూలేటి / డోల్ జాత్రా (హైదరాబాద్‌, అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రడూన్, గ్యాంగ్‌టక్, గువాహతి, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, శషిమ్లా, శ్రీనగర్)
* మార్చి 19 – హోళీ మరుసటి రోజు సెలవు (భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నా)
* మార్చి 20 – ఆదివారం (అన్ని చోట్ల సెలవు)
* మార్చి 22 – బీహార్ దివస్ (పాట్నా)
* మార్చి 26 – నాలుగో శనివారం (అన్ని చోట్ల సెలవు)
* మార్చి 27 – ఆదివారం (అన్ని చోట్ల సెలవు)

ఇక్కడ మరో ముఖ్య‌మైన‌ విషయం ఏమిటంటే, మార్చిలో ఎక్కువ‌గా బ్యాంకులు సెలవుల్లో ఉన్నా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్​, ఆర్​టీజీఎస్​, ఐఎంపీఎస్​, యూపీఐ పేమెంట్స్ యథావిథిగా పని చేస్తాయని.. ఈ సేవలను ఎప్ప‌టిలాగే 24×7 వినియోగించుకోవచ్చు. అలాగే ఎఫ్​డీ, లోన్ వంటి​ ఇతర అవసరాల గురించి నేరుగా బ్యాంకులో పని ఉంటే మాత్రం సెలవులను బట్టీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.