Site icon HashtagU Telugu

Telangana & Andhra: ఒక్కరోజులో 296కోట్లు తాగేశారు

Template (71) Copy

Template (71) Copy

నూతన సంవత్సరం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిల్లో మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే రూ.172కోట్ల మద్యం విక్రయించగా.. ఏపీలో రూ.124.10కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఇరు రాష్ట్రాల ఆబ్కారీ శాఖలు తెలిపాయి. ఏపీలో రోజువారీ అమ్మ‌కాలు సాధారణంగా రూ. 70-75 కోట్లు ఉంటుంది. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా అద‌నంగా రూ. 50 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి అని ఎక్సైజ్ శాఖ‌ తెలిపింది. కాగా.. తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి ఒక్క డిసెంబర్‌ నెలలోనే రూ.3,459 కోట్ల మద్యం విక్రయం జరిగిందని తెలంగాణ క్సైజ్ శాఖ‌ తెలిపింది.