Site icon HashtagU Telugu

Siddipet : సిద్ధిపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 120 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

Students Ill

Students Ill

సిద్ధిపేట జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ బారిన ప‌డ్డారు. పాఠ‌శాల‌లోని దాదాపు 120 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్ తో భోజనం వడ్డించారు. మిగిలిన గ్రేవీని రాత్రిపూట వండిన వంకాయ కూరలో కలిపి విద్యార్థులకు వడ్డించారు. దీంతో అర్థరాత్రి నుంచి పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. సోమవారం నాటికి వారికి క‌డుపు నొప్పి ఎక్కువ అయింది. అయితే ఈ విషయాన్ని హాస్ట‌ల్ సిబ్బంది బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు. పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందించారు. అయినప్పటికీ సుమారు 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వీరికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు అయ్యాయి. వెంటనే పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన సిబ్బంది, విద్యార్థులను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన సమాచారం తెలిసిన మంత్రి హరీష్ రావు స్పందించారు. విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version