రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపనప్పటికీ.. ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి ఎక్కువైంది. సాధారణ ప్రజలతో పాటు వైద్యులపైనా వైరస్ ప్రభావం అధికంగానే ఉంది. రోజువారీ కేసులు సంఖ్య 12 వేలు దాటింది. కరోనా చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికీ వైరస్ సోకుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ,వైద్య సిబ్బంది అధికంగా కొవిడ్ బారినపడుతున్నారని భారత వైద్య సంఘం తెలిపింది. కేసులు లెక్కకుమించి నమోదు అవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది.
AP: ఏపీలో రోజువారి కేసుల సంఖ్య 12 వేలు!

Covid