Site icon HashtagU Telugu

Biryani: బిర్యానీ తిని 12 మందికి అస్వస్థత!

Biryani

Biryani Imresizer

హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఫేమస్. కానీ కొన్ని చోట్లా ఎలాంటి నాణ్యత పాటించకపోవడంతో ఫుడ్ పాయిజన్ అవుతోంది. తాజాగా బిర్యానీ తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లో సనత్‌నగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో వడ్డించిన మండి (బిర్యానీ) తిని 12 మంది అస్వస్థతకు గురికావడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు సీల్ చేశారు.

మాషా అల్లా హోటల్‌లో భోజనం చేసిన 12 మంది అస్వస్థతకు గురికావడంతో వారిని ఆస్పత్రికి తరలించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది. GHMC అధికారులు ఆహార నమూనాలను పరీక్ష కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM)కి పంపిన తర్వాత దాన్ని మూసివేశారు. హోటల్ యాజమాన్యంపై తదుపరి చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.