Site icon HashtagU Telugu

12 cheetahs: దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు 12 చీతాలు!

Kuno National Park

Cheetah

దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు శనివారం భారత్‌కు చేరుకోనున్నట్లు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తెలిపారు. ఇందులో ఏడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో జోహన్నెస్‌బర్గ్‌ నుంచి బయలుదేరి గ్వాలియర్‌కు చేరుకోనున్న ఈ చీతాల కోసం మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో పది క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్లు సిద్ధం చేశారు. తొలివిడత కింద గతేడాది సెప్టెంబరులో నమీబియా నుంచి 8 చీతాలను భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కునో పార్కులో ఉన్న ఈ చీతాలు తరచూ వేటాడుతూ మంచి ఆరోగ్యంతో ఉన్నాయని అధికారులు తెలిపారు. వచ్చే పదేళ్ల వరకు ఏటా 12 చీతాలను దేశంలోకి దిగుమతి చేసుకునేలా కేంద్రం ప్రణాళికలు రచించింది.