Site icon HashtagU Telugu

Bulldozers demolish : గాంధీ వారసత్వ సంపద ను కూల్చేసిన బిజెపి సర్కార్…

12 buildings of Gandhian organisation demolished in Varanasi

12 buildings of Gandhian organisation demolished in Varanasi

రేపు Independence day . ఈ సందర్బంగా దేశం మొత్తం ఆ సంబరాల్లో ఉంటె..బిజెపి కేంద్ర సర్కార్ మాత్రం.. గాంధీ వారసత్వ సంపదను కూల్చేసి గాంధీని అవమానించింది. వారణాసి (Varanasi)లో ఉన్న గాంధీయన్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ (Gandhian social service organisation) ‘అఖిల భారత సర్వ సేవా సమితి’కి చెందిన 12 భవనాలను శనివారం బుల్డోజర్లతో నేలమట్టం చేసింది. అడ్డువచ్చిన గాంధేయవాదులను అదుపులోకి తీసుకుని ఆ ప్రాంగణంలో స్వతంత్ర సమరయోధుడు జయప్రకాశ్‌ నారాయణ సహవ్యవస్థాపకునిగా ఏర్పాటు చేసిన గాంధీ విద్యా సంస్థాన్‌ సహా పలు భవనాలను కూల్చివేసింది.

గత కొద్దీ నెలలుగా యూపీలో బుల్డోజర్ల (Bulldozers)తో యోగి సర్కార్ హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ భవనాలు ఉన్న, ప్రభుత్వ నిబంధనలు పాటించకపోయిన ఆయా భవనాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి అక్రమార్కుల నివాసాలు కాకుండా.. ఏకంగా జాతిపిత మహాత్మా గాంధీ వారసత్వ సంపదను కూల్చివేశాయి. ఎప్పటిలాగే రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లను పంపినా.. ఈ కూల్చివేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగాయి. ఈ భవనాలకు చెందిన స్థలం తమదేనంటూ రైల్వే శాఖ వాదిస్తుండగా, దీనిని తాము అప్పటి కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశామని గాంధేయవాదులు చెబుతూ వస్తున్నారు.

దీనిపై జిల్లా మేజిస్ట్రేట్‌ కోర్టు, అలహాబాద్‌ హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా రైల్వేకు అనుకూలంగానే తీర్పు ఇవ్వడంతో వారు పోలీసు భద్రత మధ్య ఈ భవనాలను కూల్చివేశారు. కాగా, ఈ కూల్చివేతలను ప్రముఖ రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ఈ కూల్చివేతలు చరిత్రలో అవమానకర సంఘటనగా నిలిచిపోనుందని అంత అంటున్నారు.

Read Also : Independence day 2023 : మహాత్ముడి వెంట ఉన్నవారిలో ఆ 8 మంది మహిళలు చాల ప్రత్యేకం..