Diwali Crackers Explosion : దీపావ‌ళి వేడుక‌ల్లో విషాదం.. క్రాక‌ర్స్ పేలుడులో 11 ఏళ్ల బాలుడు మృతి

దీపావ‌ళి వేడుక‌లు కొన్ని కుటుంబాల్లో చీక‌ట్లు నింపాయి. క్రాక‌ర్స్ పేలుడులో ప‌లుచోట్ల చిన్నారులు మృత్యువాత ప‌డ్డారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దీపావళి క్రాకర్స్ పేలుడులో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మచిలీపట్నం శివారులోని నవీన్‌ మిట్టల్‌ కాలనీలోని సీతానగర్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక ద్విచక్ర వాహనంపై క్రాకర్స్ పడటంతో మంటలు అంటుకుని పేలిపోయాయి. పక్కనే ఉన్నబాలుడు మంటల్లో చిక్కుకుని చనిపోయాడు. క్రాకర్లు, బైక్ పేలిన శబ్ధంతో ఒక్కసారిగా బయటకు వచ్చిన తల్లిదండ్రులు, స్థానికులు బాలుడిని వెంటనే […]

Published By: HashtagU Telugu Desk
4 killed In Fire

Fire

దీపావ‌ళి వేడుక‌లు కొన్ని కుటుంబాల్లో చీక‌ట్లు నింపాయి. క్రాక‌ర్స్ పేలుడులో ప‌లుచోట్ల చిన్నారులు మృత్యువాత ప‌డ్డారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దీపావళి క్రాకర్స్ పేలుడులో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మచిలీపట్నం శివారులోని నవీన్‌ మిట్టల్‌ కాలనీలోని సీతానగర్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక ద్విచక్ర వాహనంపై క్రాకర్స్ పడటంతో మంటలు అంటుకుని పేలిపోయాయి. పక్కనే ఉన్నబాలుడు మంటల్లో చిక్కుకుని చనిపోయాడు. క్రాకర్లు, బైక్ పేలిన శబ్ధంతో ఒక్కసారిగా బయటకు వచ్చిన తల్లిదండ్రులు, స్థానికులు బాలుడిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

  Last Updated: 25 Oct 2022, 10:02 AM IST