Site icon HashtagU Telugu

Corona Cases: భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో 11 రకాల కరోనా వేరియంట్స్!

UK Visa

UK Visa

భారత్‌కు చేరుకున్న అంతర్జాతీయ ప్రయాణికుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇవన్నీ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ కేసులేనని తెలిపాయి. మొత్తం 19 వేల227 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా..అందులో 124 మంది పాజిటివ్‌గా తేలారు. ఈ 124 మందిలో 40 కేసుల జన్యుక్రమ విశ్లేషణ ఫలితాలు వచ్చాయని, అందులో 14 నమూనాల్లో.. ఎక్స్‌బీబీ వేరియంట్‌ ఆనవాళ్లు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఒక శాంపిల్‌లో బీఎఫ్‌ 7.4.1 వేరియంట్‌ గుర్తించినట్లు తెలిపారు.