Site icon HashtagU Telugu

Warangal Crime: వరంగల్‌లో ఇళ్లకు నిప్పు పెట్టిన 11 మంది అరెస్ట్

Warangal Crime

New Web Story Copy 2023 07 06t174818.104

Warangal Crime: వరంగల్‌లోని నర్సంపేటలో ప్రేమ పెళ్లికి సహకరించిన స్నేహితుల ఇళ్లకు నిప్పంటించిన కేసులో 11 మంది నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళితే..

వరంగల్‌లోని నర్సంపేట ఇటిక్యాల పల్లి గ్రామ సర్పంచ్‌ మండలం రవీందర్‌ కుమార్తె కావ్య హనుమకొండకు చెందిన జాలిగం రంజిత్‌ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. స్నేహితుల సమక్షంలో జూన్ 30న గుడిలో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన సర్పంచ్ రవీందర్‌ పెళ్ళికి సహకరించిన స్నేహితుల ఇళ్లపై దాడి జరిపించాడు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. దహనం కారణంగా లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందని డీసీపీ కరుణాకర్ తెలిపారు.

బాధితుల ఫిర్యాదు మేరకు నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం సాయంత్రం నేరం చేసిన నిందితులు నర్సంపేట శివారులోని ఖానాపూర్‌కు వెళ్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. అరెస్టయిన వారిలో సర్పంచ్ మండలం రవీందర్, మండలం రాజమౌళి, మండలం శ్రీను, మండలం రమేష్, మండలం పైడి, మండలం సదయ్య, మండలం రాజు, మండలం శివ, గద్దల విష్ణు, మండలం రాజు, మండల సదయ్య ఉన్నారు. వారి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలు, పది సెల్ ఫోన్లు, రెండు గొడ్డళ్లు, మూడు వేట కత్తులు, కర్రలు, డీజిల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.

Read More: బ్లూ చీరలో ఐశ్వర్య రాజేష్ అదిరిపోయే లుక్స్