Earthquake: పాకిస్తాన్‌లో భూకంపం.. 11 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో మంగళవారం (మార్చి 21) రాత్రి 6.5 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు పాకిస్థాన్‌, భారత్‌లో కూడా భూకంపం సంభవించింది.

  • Written By:
  • Updated On - March 22, 2023 / 10:41 AM IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో మంగళవారం (మార్చి 21) రాత్రి 6.5 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు పాకిస్థాన్‌, భారత్‌లో కూడా భూకంపం సంభవించింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో సంభవించిన భూకంపం కారణంగా కూడా భారీ నష్టం వాటిల్లింది. ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపంలో ఇప్పటి వరకు 10 మంది మరణించారు. కాగా.. పాకిస్థాన్‌లో భూకంపం కారణంగా ఇద్దరు మహిళలు సహా 11 మంది మరణించారు. టోలో న్యూస్ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్‌లో కూడా 160 మంది గాయపడ్డారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం వల్ల ప్రభావితమైన వారందరికీ సహాయం చేయాలని మొత్తం 34 ప్రావిన్సుల గవర్నర్‌లు, దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులను ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి సిర్జావుద్దీన్ హక్కానీ ఆదేశించారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌తో పాటు ఇస్లామాబాద్, లాహోర్‌తో సహా అనేక పాకిస్తాన్ నగరాల్లో భూకంపం ప్రకంపనలు సంభవించాయి.

యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. మంగళవారం రాత్రి భూకంపం ఉపరితలం నుండి 187 కి.మీ దిగువన ఉద్భవించింది. లోతైన భూకంపాలు సాధారణంగా హిందూకుష్ ప్రాంతంలో సంభవిస్తాయి. ఇవి 100 కిమీ లేదా అంతకంటే తక్కువ లోతులో ఉద్భవిస్తాయి. లోతైన భూకంపాలు తగినంత బలంగా ఉంటే పెద్ద భౌగోళిక ప్రాంతాలపై అనుభూతి చెందుతాయి. భూకంపం సంభవించిన సమయంలో రావల్పిండిలోని మార్కెట్‌లో తొక్కిసలాట జరిగినట్లు ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ వార్తాపత్రిక నివేదించింది. ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని స్వాబిలో ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన కనీసం ఐదుగురు గాయపడినట్లు సమాచారం.

Also Read: Anti-Modi Posters: ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’.. దేశ రాజధానిలో మోదీ వ్యతిరేక పోస్టర్లు కలకలం

భారత్‌లోనూ భూ ప్రకంపనలు

హర్యానా, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్‌లో కూడా ప్రకంపనలు వచ్చాయి. భూకంపం సంభవించిన వెంటనే జమ్మూ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ సేవలకు అంతరాయం ఏర్పడిందని ఒక అధికారి తెలిపారు. NCS ప్రకారం.. భూకంపం కేంద్రం ఉత్తర అక్షాంశం 36.09 డిగ్రీలు, రేఖాంశం 71.35 డిగ్రీల తూర్పున 156 కి.మీ లోతులో ఉంది. ఉత్తరకాశీ, చమోలి సహా ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. “ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో భూకంపం సంభవించింది. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. భూప్రకంపనల అనంతరం తూర్పు ఢిల్లీలోని షకర్‌పూర్‌లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భవనం వంగిపోయిందని కొందరు పేర్కొన్నారు.