Yadadri: బ్రహ్మోత్సవాలకు ‘యాదాద్రి’ ముస్తాబు!

యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో

  • Written By:
  • Updated On - February 28, 2022 / 07:02 PM IST

యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్‌.గీత మాట్లాడుతూ.. మార్చి 4న ఉదయం 10 గంటలకు బాలాలయంలో ఆలయ అర్చకులచే విశ్వక్సేన పూజ, స్వస్తివాచనాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, సకల దేవతలను ప్రతీకాత్మకంగా బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ద్వజారోహలం నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 5వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారు మార్చి 6వ తేదీన మత్స్యావతారంలో దర్శనమిస్తారు.

మార్చి 11న ఉదయం 9 గంటలకు హనుమంత వాహన సేవ, రాత్రి 11 గంటలకు బాలాలయంలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. మార్చి 12వ తేదీ రాత్రి 7 గంటలకు రథోస్తవం.. మార్చి 13న ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహిస్తారు. మార్చి 14న షట్ఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.