Site icon HashtagU Telugu

Farmers: ఆ రైతులకు ‘రైతుబంధు’ కట్

గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు పోలీస్, ఉన్నతాధికారులు దాడులు చేస్తున్నారు. అయితే చాలాచోట్ల గంజాయి సాగు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంజాయి సాగుచేస్తున్న రైతులను రైతుబంధు పథకానికి అనర్హులుగా ప్రకటించింది వ్యవసాయ శాఖ.

రాష్ట్రంలోని అన్ని ఎక్సైజ్ స్టేషన్ల నుంచి సంబంధిత సమాచారాన్ని సేకరించి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ 109 మంది రైతుల జాబితాను సిద్ధం చేసింది. పొలాల్లో దాడులు నిర్వహించి గంజాయి సాగుపై పక్కా సమాచారం రాబట్టి కేసులు నమోదు చేశారు. రైతులు తక్కువ పరిమాణంలో గంజాయిని పండించినప్పటికీ, నిబంధనల ప్రకారం మేం కేసులు నమోదు చేసాం” అని అధికారి తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల విక్రయాలు, కొనుగోళ్లపై ఆ శాఖ సీరియస్‌గా వ్యవహరిస్తోందన్నారు.

Exit mobile version