Constable posts : హోం మంత్రి అనిత ఏపీలో అసెంబ్లీ సమావేశాలు మాట్లాడుతూ.. 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. త్వరలో 6,100 ఉద్యోగాల నియామకం పూర్తవుతుందని చెప్పారు. మిగిలిన 10, 762 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అనుమతి రాగానే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. పోలీసులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10-15 లక్షలు కుటుంబానికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Read Also: Rule Change For IPL 2025: ఐపీఎల్‌కు ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం.. బౌలర్లకు ఇది శుభవార్తే!
ఇప్పటివరకు 862 మంది పోలీస్ ఇన్ స్పెక్టర్లు (సివిల్) 6 సంవత్సరాల సర్వీసు పూర్తి చేశారు. 1995 బ్యాచ్ కు చెందిన 65 మంది ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ వారు కోర్టును ఆశ్రయించడం వల్ల ఆలస్యమైంది. త్వరలోనే కోర్టు అనుమతితో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక కమిటీ ఏర్పాటు చేసి.. సమస్యకు పరిష్కారం తీసుకొస్తామని హోం మంత్రి అనిత అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. పోలీస్ సంక్షేమం గురించి మొదట ఆలోచించింది కూటమి ప్రభుత్వమే అని పేర్కొన్నారు. DSP పదోన్నతులు ఇవ్వకపోవడానికి కారణం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సీనియారిటీ జాబితా సవరించడమే అన్నారు. 2017లో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2018లో సీనియారిటీ జాబితాను ప్రభుత్వం జారీ చేసింది. ఇచ్చిన సీనియారిటీ లిస్టులో 1995 కు చెందిన DSP వెంకటేశ్వర్లు.. సీనియారిటీని నిర్ణయించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కోర్టులో ఉండడం వల్ల ప్రమోషన్లకు ఇబ్బంది ఉంది.
తెలంగాణలో కోర్టు ఇష్యూ లేకపోవడం వల్లే ప్రమోషన్లు కొత్త పోస్టులు కల్పిస్తే ఏడాదికి ఒక్కో వ్యక్తికి రూ.11,75,325 ఆర్థిక భారం పడుతుంది. ఏడాదికి ప్రభుత్వం పై మొత్తం రూ.101,31,30,150 భారం పడుతుంది. ప్రభుత్వం పై ఆర్థిక భారం పడినా కూడా త్వరలోనే సాంకేతిక అడ్డంకులను తొలగించి ప్రమోషన్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హోం మంత్రి అనిత చెప్పారు. సూపర్ న్యూమరీ పోస్టుల ద్వారా వారికి ప్రమోషన్లు కల్పించాం. దీనివల్ల సీఐ, ఎస్సై పోస్టుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి అని హోం మంత్రి అనిత అన్నారు.
Read Also: Kadapa : కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల