Site icon HashtagU Telugu

Owaisi: ఓవైసీ క్షేమం కోరుతూ 101 మేకలు బలి!

Whatsapp Image 2022 02 06 At 15.37.45

Whatsapp Image 2022 02 06 At 15.37.45

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఓవైసీపై కాల్పుల జరగడాన్ని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అటాక్ జరిగిన రోజే.. పాతబస్తీలో అభిమానులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓవైసీ రక్షణ కోరుతూ, ఆయన క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని బాగ్-ఎ-జహనారా వద్ద ఓ వ్యక్తి 101 మేకలను బలి ఇచ్చాడు. కార్యక్రమంలో మలక్‌పేట ఎమ్మెల్యే, ఏఐఎంఐఎం నాయకుడు అహ్మద్‌ బలాల ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఎంపీ ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. ఫిబ్రవరి 3న దాడి జరిగినప్పటి నుండి, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ ఒవైసీ మద్దతుదారులు అతని భద్రత, దీర్ఘాయువు కోసం ప్రార్థనలు చేస్తున్నారు. దాడి తర్వాత, అసదుద్దీన్ ఒవైసీకి Z- కేటగిరీ భద్రతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదించింది. తాను చావుకు భయపడనని, ప్రజల్లోనే ఉంటానని ఒవైసీ జడ్ ప్లస్ భద్రతను రిజెక్ట్ చేశారు.

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమం ముగించుకుని తిరిగి ఢిల్లీకి వెళ్తుండగా ఛజర్సీ టోల్ ప్లాజా సమీపంలో ఆయన వాహనంపై కాల్పులు జరిగాయి. ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. హాపూర్‌లోని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కథనం ప్రకారం.. ప్రధాన నిందితుడు సచిన్ పండిట్ బుల్లెట్లు కాల్చాడు. అతని వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సచిన్, శుభమ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.