Jan Aushadhi Kendra: సామాన్యుల కోసం జన్ ఔషధీ కేంద్రాలు.. ఏడాది చివరి నాటికి 10 వేల కేంద్రాలు ఏర్పాటు?

మాములుగా సామాన్యులు మెడికల్ షాప్ కి వెళ్లి మందులు కొనాలి అంటేనే భయపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు వేలకు వేలు

Published By: HashtagU Telugu Desk
Jan Aushadhi Kendra

Jan Aushadhi Kendra

మాములుగా సామాన్యులు మెడికల్ షాప్ కి వెళ్లి మందులు కొనాలి అంటేనే భయపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు వేలకు వేలు మందులకు ఖర్చు అవుతూ ఉంటుంది. దాంతో సామాన్యులు అలాంటి మందులను కొనలేక ప్రభుత్వ ఆసుపత్రిలో వైఫై మొగ్గు చూపుతూ ఉంటారు. అలాంటి వారికి ఖరీదైన మందులను ఉచితంగా అందించడం కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జన్ ఔషధీ కేంద్రాలను ప్రారంభించింది. మధుమేహం రక్తపోటు గుండె ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించిన మందులను ఈ జన్ ఔషధీ కేంద్రాలలో సుమారు 50 నుండి 90% తగ్గింపుతో లభిస్తాయి.

ఇప్పుడు ఈ జన్ ఔషధీ కేంద్రాల నెట్వర్క్ ను పెంచాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్రాలను పెంచడం కోసం ప్రభుత్వం దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. ఈ ఏడాది చివరికి దాదాపు పదివేల కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాగా బ్యూరో ఆఫ్ మెడిసిన్స్ అండ్ మెడికల్ డివైసెస్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవి దదిచ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి ఏ దేశవ్యాప్తంగా మొత్తం పదివేల జన్ ఔషధీ కేంద్రాలు పని చేస్తాయని భావిస్తున్నాను. మే 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా మొత్తం 9,484 జన్ ఔషధీ కేంద్రాలు యాక్టివ్ గా ఉన్నాయని తెలిపారు. గురుగ్రామ్ లోని సెంట్రల్ వేర్హౌస్ లో దధీచ్ విలేకరులతో మాట్లాడుతూ..

కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధీ పరియోజన కింద దేశవ్యాప్తంగా గురుగ్రామ్, చెన్నై, గౌహతి, సూరత్ లలో నాలుగు దుకాణాలు ఉన్నాయి. వీటిలో గురుగ్రాంలోని సెంట్రల్ వేర్ హౌస్ అతిపెద్దది. 1800 మంది లతో పాటు 265 సర్జికల్ పరికరాలను చాలా సరసమైన ధరలకు నాణ్యతలో రాజీ పడకుండా అందజేస్తాము అని దదీచ్ తెలిపారు.

  Last Updated: 18 Jun 2023, 03:43 PM IST