Mulugu: మేడారం జాతరకు 1000 మంది పోలీసులతో బందోబస్తు

  • Written By:
  • Publish Date - February 5, 2024 / 03:15 PM IST

Mulugu: సమ్మక్క సారక్క జాతరకు ఇంకా 18 రోజుల సమయం ఉండడంతో 1000 మంది పోలీసులతో పోలీసు శాఖ భారీ బందోబస్తును సిద్ధం చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ములుగులోని ఉరోటం కాల్వపల్లి పార్కింగ్‌ స్థలాల్లోకి వాహనాల రాకపోకలను పరిశీలించారు. దీంతో పాటు సీసీటీవీ ఫుటేజీలతో కూడిన నిఘా గదిని, మేడారం కంట్రోల్ రూమ్‌ను కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ అశోక్‌కుమార్‌, ఎస్పీ ఏటూరునాగారం శిరిశెట్టి సంకీర్త్‌, డీఎస్పీ రవీందర్‌, ఇతర జిల్లాల సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

మేడారం సమ్మక్క- సారక్క జాతర అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఎత్తు బంగారమే.. ఇక్కడ బెల్లాన్ని ఎత్తు బంగారంతో పోల్చుతారు. భక్తులు ఎంతో భక్తి శ్రధ్ధలతో వచ్చి వనదేవతలైన అమ్మవార్లకు ఈ ఎత్తు బంగారాన్ని సమర్పిస్తారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారంలో ఎత్తు బంగారాన్నికొనుగొలు చేసిన భక్తులు వివరాలను సేకరించి తమకు అందజేయాలని వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. భక్తుల నుంచి ఆధార్ జిరాక్స్, ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ తీసుకుని ఎత్తు బంగారన్ని విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే దీని వెనుక కారణం లేకపోలేదు. బెల్లాన్ని బయట అమ్ముకుని… గుడుంబా తయారీకి ఉపయోగించే అవకాశం ఉండటంతో అధికారులు ఈ నిబంధనలు పెట్టారు. బెల్లాన్ని విక్రయించి గుడుంబా తయారీ ఉపయోగిస్తే లక్ష జరిమానా విధిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు.