Site icon HashtagU Telugu

100 Year Old Banyan Tree : ప్రకృతిపై ప్రేమంటే ఇదే.. వందేళ్ల మర్రిచెట్టును మళ్ళీ బతికించిన అనిల్ గొడవర్తి

100 Year Old Banyan Tree

100 Year Old Banyan Tree

100 Year Old Banyan Tree : తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 100 ఏళ్ల మర్రిచెట్టు మళ్లీ ప్రాణం పోసుకుంది..

20 టన్నులకుపైగా బరువు, దాదాపు 10 అడుగుల వెడల్పు కలిగిన ఈ మర్రిచెట్టును క్రేన్ల సాయంతో పైకి లేపి 54 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రైవేటు స్థలంలోకి మార్చారు.

ప్రకృతి ప్రేమికుడు అనిల్ గొడవర్తి, అతడి స్నేహితులు కలిసి చొరవ చూపి ఈ మర్రిచెట్టు మళ్ళీ జీవించడానికి ఒక చోటును ఇచ్చారు. 

“మే 30న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ సమీపంలో ఘన్‌పూర్‌ గ్రామం ఉంది. ఆ ఊరిలో ఉండే నా ఫ్రెండ్ అనిల్‌కుమార్‌ ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు పడి ఉండటాన్ని చూశాను. దాన్ని చూసిన వెంటనే డిసైడ్ అయ్యాను. ఎలాగైనా ఆ చెట్టుకు మళ్ళీ లైఫ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆ చెట్టును అలా పడేయడం నాకు బాధ కలిగించింది. అందుకే నేను నా స్నేహితులను సంప్రదించి.. దాన్ని మరో చోటుకు మార్చి తిరిగి లైఫ్ ఇస్తే ఎలా ఉంటుందని డిస్కస్ చేశాను” అని ప్రకృతి ప్రేమికుడు అనిల్ గొడవర్తి ఓ మీడియా సంస్థకు చెప్పాడు.. “నా ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా ప్రకారం.. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లోని చెట్ల పెంపకం విభాగం, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ చీఫ్ కోఆర్డినేటర్ ఆఫీసర్‌ ను నేను కాంటాక్ట్ అయ్యాను. ఈ మర్రి చెట్టును(100 Year Old Banyan Tree) ఎలా తరలించాలి ? ఇందుకోసం ఎలాంటి రెస్క్యూ ప్లాన్ రెడీ చేయాలి ?  మళ్ళీ  ఎలా ప్లాంట్ చేయాలి ? అనేది తెలుసుకున్నాను” అని అనిల్ గొడవర్తి వివరించాడు.

Also read : Hemp Seeds: జనపనార విత్తనాలు గురించి విన్నారా..!? జనపనార విత్తనాలు తీసుకుంటే ఏంటి లాభం..?

మర్రిచెట్టు రెస్క్యూ ఇలా చేశారు.. 

“ఆ వెంటనే మేం రంగంలోకి దిగాం.. అప్పటికే మర్రి చెట్టు యొక్క మొత్తం వేళ్ళు, మట్టితో పాటు చెక్కుచెదరకుండా ఉన్నాయి.. చెట్టు కొమ్మలను మాత్రం కత్తిరించారు. వెంటనే గోనె సంచులు, తాటాకులతో వేర్లను  కప్పి నీళ్లు పోయడం మొదలుపెట్టాం. ఇందుకోసం స్టేషన్‌ ఘన్‌పూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని నర్సరీ నుంచి నీటిని తెచ్చుకునేందుకు 100 మీటర్ల నీటి పైపును ఉపయోగించాం. చెట్టు వేర్లపై  క్రమం తప్పకుండా నీళ్లు పోసే పనిని మేము కొంతమంది స్థానిక గ్రామస్తులకు అప్పగించాం.. ఇది జరిగిన రెండు వారాల తర్వాత మర్రిచెట్టు ఆకులు మొలకెత్తడం ప్రారంభించాయి.. దీంతో ఆ చెట్టు తిరిగి బతికిందని కన్ఫర్మ్ చేసుకున్నాం.. ఇక ఆ చెట్టును 54 కిలోమీటర్ల దూరంలోని  యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న నా సొంతూరు మోటంకొండూర్‌కు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాం. నాకు ఒక ఎకరం భూమి ఉంది. చెట్టును తరలించే క్రమంలో మాకు సాయం చేయడానికి  HMDA అధికారులు ఒక కాంట్రాక్టర్‌ను పంపారు. జూన్ మూడో వారంలో చెట్టును మోటంకొండూరుకు తరలించేందుకు కసరత్తు మొదలైంది. మర్రి చెట్టును ఎత్తి ట్రక్కులో వేయడానికి 12 టన్నుల సామర్థ్యం గల 4 క్రేన్‌లను వాడాం. ఆ చెట్టును నాటేందుకు మా భూమిలో 8 అడుగుల లోతున్న గుంతను తవ్వాము.. ఎర్త్ మూవర్ సహాయంతో చెట్టును జాగ్రత్తగా కందకంలోకి దింపాము. తర్వాత గోమూత్రం, మట్టితో ఆ గుంతను నింపాం. ఈ మొత్తం పనికి రూ.90వేలు ఖర్చు వచ్చింది ” అని మర్రిచెట్టు రెస్క్యూ మిషన్ గురించి అనిల్ గొడవర్తి వివరించాడు.