Site icon HashtagU Telugu

Bihar: మధ్యాహ్న భోజనంలో పాము

Bihar

Logo (27)

Bihar: బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో బాలికల పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం ఆందోళన కలిగించింది. విచారణ నివేదిక ఆధారంగా పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోనున్నారు. ఈ సంఘటన మధురాపూర్ బాలిక మిడిల్ స్కూల్ లో చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో విద్యార్థుల్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స కోసం సమస్తిపూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై సమస్తిపూర్ జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ ప్రారంభించగా, ఆరోగ్య శాఖ ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితులను పర్యవేక్షిస్తోంది.

Also Read: TS RERA: ఏజీఎస్‌ సంస్థకు రెరా రూ.50 లక్షల జరిమానా