Site icon HashtagU Telugu

NTR COIN Released  : ‘ఎన్టీఆర్‌ కాయిన్’ విడుదల.. ప్రోగ్రామ్ కు ఆ ఇద్దరు గైర్హాజరు

Ntr Coin Released

Ntr Coin Released

NTR COIN Released  : స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆ మహా నటుడు, మహా నాయకుడికి భారత ప్రభుత్వం విశిష్ట గుర్తింపు ఇచ్చింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ (ఉదయం) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ పేరు మీద 100 రూపాయల ప్యూర్ (100 శాతం) మెటల్ కాయిన్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. కీలకమైన ఈ ప్రోగ్రామ్ కు తెదేపా అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, పురంధేశ్వరి కొందరు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులు సైతం కార్యక్రమానికి వచ్చారు.

Also read : 86 Push Ups In 1 Minute : 1 నిమిషంలో 86 పుషప్ లు ఎలా కొట్టాడో చూడండి .. ‘పుషప్ మ్యాన్’ వరల్డ్ రికార్డు

షూటింగ్‌లో బిజీగా ఉన్నందున జూనియర్ ఎన్టీఆర్, పాదయాత్రలో ఉన్నందున లోకేష్ (NTR COIN Released)  హాజరుకాలేదు. బీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. 44 మిల్లీమీటర్ల చుట్టు కొలతతో ఉండే ఈ కాయిన్ పై ఎన్టీఆర్ ఫొటో, ఆయన పుట్టిన తేదీ ఉన్నాయి. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, దానికింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు.