BRS Minister: 40 కోట్ల నిధులతో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోస్గి మున్సిపల్ అభివృద్ధికి చేశారని, కేసీఆర్, కేటీఆర్ సాయంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. కోసిలు బస్ డిపో నిర్మాణం, ఆసుపత్రి ప్రారంభం, విద్యాసంస్థల ఏర్పాటు, అంతర్గత సీసీ రోడ్లు, యూజీడీల నిర్మాణాలను చేసి 50 ఏళ్ల సమస్యలను 5 ఏళ్ల కాలంలో పూర్తి చేశాడని ఆయన అన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి దాదాపు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పార్టీలో చేరడం కార్యకర్తలు గర్వంగా భావిస్తున్నారని చెప్పారు.
BRS Minister: మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో 100 మంది బీఆర్ఎస్ లో చేరిక

Patnam-Mahender-Reddy