Site icon HashtagU Telugu

Girl Runs 200km: ఆ లక్ష్యమే..10ఏళ్ల బాలికను 200 కిలోమీటర్లు పరుగెత్తెలా చేసింది..!!

Girl Imresizer

Girl Imresizer

వయస్సు పది సంవత్సరాలు. ఆమె చదువుతున్నది నాలుగో తరగతి. ఆమె పేరు కాజల్. ప్రయాగ్ రాజ్ నుంచి లక్నో వరకు 200 కిలోమీటర్ల కార్యక్రమాన్ని ఏప్రిల్ 10వ తారీఖున ప్రయాగ్ రాజ్ నుంచి పరుగు ప్రారంభించింది. ఏప్రిల్ 15న లక్నోకు చేరుకుంది. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసింది. బాలికకు శుభాకాంక్షలు తెలిపిన యోగి ఆదిత్యనాథ్ క్రీడాకారిణగా ఎదగాలని…దేశానికి పతకాలు సాధించేలా కృషి చేయాలని ఆశీర్వదించారు.

యోగి అధికారిక నివాసంలో కాజల్ కు ఒక జత బూట్లు, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ కిట్ ను యోగి ఆధిత్యానాథ్ బహుమతిగా అందించారు. అథ్లెటిక్స్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ఆమెను యోగి ఆధిత్యానాథ్ చెప్పారని యూపీ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. కాజల్ కూడా సీఎంకు కృతజ్ఞతలు తెలిపింది. కాగా చిన్నారి కాజల్ కు అథ్లెట్ కావాలన్నది తన ఆశయం. అథ్లెట్ గా మారి దేశానికి పేరు తెచ్చే విషయంలో తనకు కావాల్సిన వనరుల కోసం ఈ మారథాన్ ను ప్రారంభించింది. సీఎం యోగీ తన సహాయం చేస్తారని ఆశపడింది. 2021లో ఇందిరా మారథాన్ పరుగు పందెంలో పాల్గొన్నానని..అయినా కూడా జిల్లా యంత్రాంగం నుంచి స్కూల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని వాపోయింది.

దీంతో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ను కలిసేందుకు ఈ పరుగుపందెంను ప్రారంభించింది. ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు..సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పరుగులో పాల్గొన్నది ఈ చిన్నారి. మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకున్నది. ఈ చిన్నారి స్వగ్రామం యూపీలోని లలిత్ పూర్. కాజల్ తండ్రి పాయింట్ మెన్ గా పనిచేస్తున్నారు.

Exit mobile version