Site icon HashtagU Telugu

Hyderabad : హైద‌రాబాద్‌లో విషాదం.. మ్యాన్‌హోల్‌లో ప‌డి బాలిక మృతి

Death Representative Pti

Death Representative Pti

హైదరాబాద్ కళాసిగూడ ప్రాంతంలో విషాదం నెల‌కొంది. ఈ రోజు ( శనివారం) పదేళ్ల బాలిక ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు కోల్పోయింది.మ్యాన్‌హోల్‌లో ప‌డిన బాలికను మౌనికగా పోలీసులు గుర్తించారు. మౌనిక‌ ఉదయం కిరాణా సామాన్లు కొనుగోలు చేసి ఇంటికి వెళుతున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు సమాచారం. అయితే మ్యాన్‌హోల్‌లో పడకుండా ఓ మానసిక వికలాంగుడిని రక్షించిన మౌనిక తర్వాత ఆమె అందులో పడిపోయిందని స్థానికులు తెలిపారు. సికింద్రాబాద్‌లోని పార్క్ లేన్ సమీపంలోని నాలాలో ఆమె మృతదేహాన్ని GHMC DRF బృందం, స్థానిక పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటనతో జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్ల‌క్ష్యం బ‌య‌ట‌ప‌డింది. న‌గ‌రంలో తెల్ల‌వారుజామున భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో నాలాల‌న్నీ పొంగిపోర్లుతున్నాయి. ఈ స‌మ‌యంలో బాలిక కిర‌ణా షాపుకు వెళ్లి వ‌స్తుండ‌గా మ్యాన్‌హోల్ తెరిచిఉండ‌టంతో అది క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆ బాలిక దానిలో ప‌డి మృతి చెందింది.