Site icon HashtagU Telugu

Omicron: ఓమిక్రాన్‌తో బాధపడుతున్న పది మంది రికవరీ!

Omicron

Omicron

రాకపోకల నిమిత్తం అంతర్జాతీయ ప్రయాణికులు తెలంగాణకు వస్తున్న విషయం తెలిసిందే. వాళ్లలో కొంతమంది ఓమిక్రాన్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ మీడియా బులెటిన్ ప్రకార.. ఓమిక్రాన్‌తో బాధపడుతున్న పది మంది వ్యక్తులు కోలుకున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా రాష్ట్రం 38 ఓమిక్రాన్ కేసులను గుర్తించింది. ప్రజారోగ్య నిపుణులు సూచించిన విధంగా రికవరీలు వేరియంట్ తక్కువ తీవ్రతను సూచిస్తున్నాయి. ఓమిక్రాస్ కేసులు వెలుగు చూస్తుండటంతో రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ వద్ద టెస్టుల సంఖ్య పెంచారు. ఏమాత్రం లక్షణాలు ఉన్నా వెంటనే టెస్టులకు రిఫర్ చేస్తున్నారు.