HC Judges: హైకోర్టులో 10 మంది జ‌డ్జిల ప్ర‌మాణం

సుప్రీం కోర్టు కొలిజియం ఎంపిక చేసిన 10 మంది జ‌డ్జిలు తెలంగాణ హైకోర్టులో గురువారం ప్రమాణం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ స‌తీష్ శ‌ర్మ‌ కొత్తగా నియమితులైన 10 మంది జడ్జిలతో ప్రమాణం చేయించారు.

  • Written By:
  • Updated On - March 24, 2022 / 02:22 PM IST

సుప్రీం కోర్టు కొలిజియం ఎంపిక చేసిన 10 మంది జ‌డ్జిలు తెలంగాణ హైకోర్టులో గురువారం ప్రమాణం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ స‌తీష్ శ‌ర్మ‌ కొత్తగా నియమితులైన 10 మంది జడ్జిలతో ప్రమాణం చేయించారు. ప్ర‌మాణం చేసిన జ‌డ్జిల్లో కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్ కుమార్,శ్రీదేవి, ఎస్‌.వి.శ్రావణ్ కుమార్, జి. అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్ రెడ్డి, డాక్టర్ దేవరాజ్ నాగార్జున లు ఉన్నారు.
కొత్తగా 10 మంది జడ్జిలు ప్రమాణం చేయడంతో తెలంగాణ హైకోర్టు జడ్జిల సంఖ్య 29కి చేరింది. ఇటీవ‌ల సుప్రీం కోర్టు పది మంది జడ్జిల నియామకం కోసం సిఫారసు చేసింది. ఆ సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించారు. పది మందిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం విదిత‌మే.
హైకోర్టు మొదటి కోర్టు హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయ‌మూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ నూతన జడ్జిలతో ప్రమాణం చేయించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 19 మంది జడ్జిలు సేవలు అందిస్తున్నారు. గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేసిన 10 మంది జ‌డ్జిల‌తో క‌లుపుకుని 29కి జ‌డ్జిల సంఖ్య చేరింది. అయితే, తెలంగాణ హైకోర్టుకు 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉంది. హైకోర్టు చ‌రిత్ర‌లో ఒకేసారి పది మంది న్యాయమూర్తులు నియమితులవడం ఇదే మొదటిసారి కావ‌డం విశేషం.