Site icon HashtagU Telugu

Omicron in AP:ఏపీలో ఒక్క రోజే 10 ఒమిక్రాన్ కేసులు.. ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు

omicron

omicron

ఏపీలో ఒమిక్రాన్ కేసుల పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందుతున్నారు. బుధ‌వారం ఒక్క రోజే ప‌ది ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వ్వ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు.తూ.గో జిల్లాలో మూడు, అనంతపురం జిల్లాలో రెండు, కర్నూలు జిల్లాలో రెండు, ప‌శ్చిమ‌గోదావ‌రి, గుంటూరు, చిత్తూరు జిల్లాలో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్యను 16కి చేరింది. గతంలో కువైట్, నైజీరియా, సౌదీ అరేబియా, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లను సందర్శించి వ‌చ్చిన వారిగా అధికారులు గుర్తించారు.

ఓమిక్రాన్ కేసులకు సంబంధిచి వారి కాంటాక్ట్స్ అన్నింటిని ప‌రిశీలించామ‌న.. పాజిటివ్ శాంపిల్స్‌పై జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించినట్లు హెల్త్ డైరెక్ట‌ర్ డాక్టర్ హైమావతి తెలిపారు. కరోనా నియంత్ర‌ణ‌లో భాగంగా మాస్క్ ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, ఎక్కువ‌మంది ఒకే చోట గుమిగూడ‌కుండా ఉండ‌టం, భౌతిక‌దూరం పాటించ‌డం వంటివి చేయాల‌ని ఆమె కోరారు. టీకాలు వేసుకోనివారు లేదా ఇంకా రెండవ మోతాదు తీసుకోని వారు వీలైనంత త్వరగా తీసుకోవాల‌ని తెలిపారు. ఇదిఇలా ఉంటే భారతదేశంలో మంగళవారం 9,195 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కాసేలోడ్ 77,002గా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కి పెరిగింది, కనీసం 241 మంది వైరస్ నుండి కోలుకున్నారు.