Site icon HashtagU Telugu

Job to 10 months old kid : 10 నెల‌ల చిన్నారికి రైల్వే ఉద్యోగం… భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌ట‌న‌

Railway Job kid

Railway Job kid

ఛత్తీస్‌గఢ్: రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోవడంతో 10 నెలల చిన్నారికి భారతీయ రైల్వేలో ఉద్యోగం వచ్చింది. బహుశా భారతీయ రైల్వే చరిత్రలో ఇలా ఉద్యోగం రావ‌డం మొద‌టిసారి అని ఉద్యోగులు అంటున్నారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన 10 నెలల పాపకు జాతీయ క్యారియర్ కారుణ్య నియామకం ఇచ్చింది.

శిశువుకు ఇప్పటికే భారతీయ రైల్వేలో ఉద్యోగం ఉందని.. ఆ చిన్నారికి 18 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేర‌వ‌చ్చని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే అధికారులు రైల్వే రికార్డుల్లో అధికారిక నమోదు గుర్తు కోసం చిన్నారి వేలిముద్రలను తీసుకున్నారు. భారతీయ రైల్వే తొలిసారిగా కారుణ్య ప్రాతిపదికన ఈ వయస్సు పిల్లలకు అందించిందని రైల్వే అధికారి తెలిపారు. జూన్ 1న రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించిన ఛత్తీస్‌గఢ్‌లోని చిన్నారికి ఇది ద‌క్కింది. చిన్నారి తండ్రి రాజేంద్ర కుమార్ భిలాయ్‌లోని రైల్వే యార్డులో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఈ ప్రమాదం నుంచి చిన్నారి సురక్షితంగా బయటపడింది.

Pic- File Photo