Site icon HashtagU Telugu

10 Killed : పెళ్లి బస్సు బోల్తా.. 10 మంది మృతి

10 Killed

10 Killed

దారుణం జరిగింది.. 

పెళ్లి బస్సు బోల్తా పడింది.. 

ఈ దుర్ఘటనలో 10 మంది(10 Killed) చనిపోయారు..

వాళ్లంతా హ్యాపీగా పెళ్లి రిసెప్షన్ కు అటెండ్ అయ్యారు. అది పూర్తి కాగానే సోమవారం తెల్లవారుజామున బస్సులో కూర్చొని..  వచ్చిన చోటుకు బయలుదేరారు. అయితే అనుకోని ప్రమాదం వారికి ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న బస్సు ఆస్ట్రేలియాలోని చిన్న పట్టణం గ్రెటా సమీపంలో ఉన్న జంక్షన్ దగ్గర బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 10 మంది(10 Killed) ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన ప్రదేశం.. సిడ్నీకి ఉత్తరాన ఆస్ట్రేలియాలోని హంటర్ వైన్ ప్రాంతంలో ఉంది.

Also read : Violence Against Women : భార్యను కొట్టడం సరైనదే.. మూడోవంతు పురుషుల ఒపీనియన్

ఈ ఘటనలో మరో 11 మంది గాయపడ్డారు. వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. మరో 18 మంది ప్రయాణికులకు  గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్  58 ఏళ్ల వ్యక్తి  అని చెప్పారు. ప్రమాద స్థలిని స్పెషలిస్ట్ ఫోరెన్సిక్ పోలీసులు, క్రాష్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పరిశీలిస్తోంది. హంటర్ ప్రాంతం ద్రాక్షతోటలు, కంగారూలు, స్థానిక బుష్‌ల్యాండ్‌తో నిండి ఉంటుంది. ఈ ఏరియా  పర్యాటకులు, సమూహ విహారయాత్రలకు చాలా ఫేమస్.