Site icon HashtagU Telugu

10 Dead: కాంబోడియాలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది సజీవ దహనం

Cambodia fire

Resizeimagesize (1280 X 720) (1)

కాంబోడియా (Cambodia)లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పోయిపేట్‌లోని గ్రాండ్ డైమండ్ సిటీ హోటల్ నిర్వహిస్తున్న క్యాసినో సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 10 మంది (10 dead) సజీవదహనమయ్యారు. 30 తీవ్రంగా (30 injured) గాయపడ్డారు. మంటలు ఎగిసిపడుతుండటంతో వాటిని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు.

కాంబోడియాలోని పోయిపేట్‌లోని ఓ హోటల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 10 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత చాలా మంది అదృశ్యమయ్యారు. దాదాపు 70 శాతం మంటలు అదుపులోకి వచ్చినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. అగ్నిమాపక దళం వాహనాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. పోయిపేట్‌లోని గ్రాండ్ డైమండ్ సిటీ హోటల్ అండ్ క్యాసినోలో ఈ ఘటన జరిగింది. దాదాపు 50 మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. హోటల్‌లో మంటలు కొన్ని గంటలపాటు కొనసాగుతూనే ఉన్నాయి. స్పాట్ నుండి షాకింగ్ వీడియో కూడా వచ్చింది. దీనిలో ప్రజలు మంటలను తప్పించుకోవడానికి అంతస్తుల నుండి క్రిందికి దూకుతున్నారు.

Exit mobile version